Movies

భర్తతో విడిపోవడానిక అతడు కారణమే కాదంటున్న బ్యూటీ

తమిళ బ్యూటీ అమలా పాల్ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను గతంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో అమలా పాల్ తన భర్తతో విడాకులు తీసుకుంది.కాగా కోలీవుడ్‌లో అమలా పాల్ విడాకుల విషయం అనేక పుకార్లకు తెర లేపింది.

రీసెంట్‌గా అమలా పాల్ విడాకులకు అసలు కారణం మరో హీరో ధనుష్ అని కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ఈ వార్త గురించి తెలుసుకున్న అమలా పాల్ ఆశ్చర్యానికి గురైంది.దీంతో ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.ధనుష్ తనకు కేవలం ఓ మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది.తన విడాకులకు ధనుష్ ఏమాత్రం కారణం కాదని అమలా తేల్చి చెప్పింది.

ఇలా తన భర్తతో విడాకులకు ధనుష్ కారణం అని మీడియాలో వార్తలు రావడం నిజంగా బాధాకరమని ఆమె ఫీలవుతోంది.ఇక సినిమాల పరంగా ఆమె వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."