వరల్డ్ ఫేమస్ లవర్ త్రీ డేస్ కలెక్షన్స్.. ప్లాప్ లాంఛనమే…!
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వాలంటైన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ అయిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లలో రిలీజ్ అయ్యి డివైడ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే ఎక్కడో సినిమా కాస్త తేడా కొట్టడంతో మూడు రోజులలోనే ప్లాఫ్ టాక్‌ని దక్కించుకుంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మూడు రోజులలో 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ చిత్రానికి విడుదలకి ముందు 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా, మూడురోజులకు గాను 10 కోట్ల షేర్ మాత్రమే రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. నోటా కంటే తక్కువగా ఈ సినిమాకు యూఎస్ లో వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా ఎంత డిజాస్టర్ దక్కించుకుందనేది తేలిపోయింది.
