టాక్స్ దాడులపై మహేష్ హీరోయిన్ క్లారిటీ…నిజమేనా…?

కొందరు హీరో హీరోయిన్స్ కొన్ని విషయాలకే పరిమితం అవుతారు. మీడియా అడిగే ప్రశ్నలకు అంతగా స్పందించడానికి ఇష్టపడరు. కానీ ఏ ప్రశ్నకు అయినా సమాధానం చెబుతానన్నట్లుగా రీల్ గీత రియల్ రష్మిక మందన్న ఉంటుంది. మరి రోటీన్ కు భిన్నంగా ఇలా ఏం జరిగినా వింతగానే ఉంటుంది. నిజానికి ఎవరైనా సరే, వారు చెప్పాలనుకునే విషయాలే తప్పించి.. ఇంకేమీ ఉండవు. అందుకే మిగిలిన రిపోర్టింగ్ లో లేని చిత్రమైన పరిమితి సినిమా రిపోర్టింగ్ లో కనిపిస్తుంది. పైగా సినిమా సినిమా రిపోర్ట్రర్స్ కి కొన్ని పరిమితులుంటాయి. ఒకవేళ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే రిపోర్టర్ కు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూ దక్కదు. అయితే రష్మిక దేనికైనా సై అనడం విచిత్రమే కదా.

వరుస చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా నటించిన భీష్మ ఈ వారమే విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ఆమె కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలాంటి సందర్భంగా ఇటీవల ఆమె ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ గురించి అడిగితే, ఏమాత్రం ఇబ్బందికి పడకుండా జవాబు ఇచ్చేసింది. సాధారణంగా ఐటీ తనిఖీలు లాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగి తమను ఇబ్బంది పెట్టొద్దని సినీ ప్రముఖులు చెబుతుంటారు.

దీనికి భిన్నంగా రష్మిక మాత్రం ప్రశ్నకు బదులిస్తూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం విశేషం గా చెబుతున్నారు. తన తండ్రి వ్యాపార వేత్త అని.. తాను నటిని కావటంతో తమ ఇంట్లో క్యాజువల్ గా ఐటీ రైడ్స్ చేసారని, తనిఖీలు జరుగుతున్నా యని తెల్సి, తాను వెళ్లానని, అయితే తమ ఇంట్లో ఏమీ దొరక నందున ఐటీ అధికారులు వెళ్లి పోయినట్లు ఆమె వివరించారు. దటీజ్ రష్మిక అంటూ అందరూ అనుకున్నారు.