ఆ విషయంలో నితిన్, నిఖిల్ పోటీపడుతున్నారు…ఇద్దరిలో ఉన్న పోలికలు
గతంలో పెళ్లికాని ప్రసాద్ అంటుండేవారు. కానీ ఇప్పుడు పెళ్లికాని ప్రభాస్ అంటున్నారు. అయితే ఇపుడు ఇద్దరు హీరోలు పెళ్ళికి సిద్ధపడ్డారు. యాదృచ్ఛికమో ఏమో కానీ టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ లు ఒకే సారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలతో టాలీవుడ్ మీడియా దద్దరిల్లి పోతుంది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ముచ్చట్లు, ప్రేమ సంగతులు చర్చించుకుంటున్నారు. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే అవ్వడం ఇందుకు ప్రధాన కారణం. నితిన్ 8 ఏళ్లుగా ప్రేమిస్తుంటే, నిఖిల్ 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ,సుదీర్ఘ కాలపు ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు సిద్దం అయ్యారు.
వీరిద్దరి ప్రేమ విషయాల్లో ఇంకా పలు విషయాల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దాంతో వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో వీరి పెళ్లి తేదీకి సంబంధించిన విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది. వీరిద్దరు కూడా ఒకే రోజున పెళ్లి చేసుకోబోతున్నారట. నితిన్ ఏప్రిల్ 16న దుబాయిలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఇటీవలే పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారట.
ఎందుకంటే నిఖిల్ ఇంట్లో వాళ్ళు కూడా ఏప్రిల్ 16నే నిఖిల్ వివాహం చేయాలనీ భావిస్తున్నారట. వెన్యూ ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి డేట్ పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నిఖిల్, నితిన్ ఇద్దరు కూడా ఒకే రోజున పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. బాక్సాపీస్ వద్ద యంగ్ హీరోలు పోటీ పడటం ఇప్పటి వరకు మనం చూశాం. కాని మొదటి సారి పెళ్లి విషయంలో ఒకే తేదీన వీరిద్దరు పోటీ పడి మరీ పెళ్లి చేసుకోవడం నిజంగా మిరాకిల్ అంటున్నారు.