Movies

నయనతార కెరీర్ ప్రమాదంలో పడిందా…ఆమె తీరు మారకపోతే అంతే సంగతులు

మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సరిగ్గా ఉండాలి. లేకుంటే సీన్ రివర్స్ అయిపోతోంది. సరిగ్గా ఇప్పుడు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ విషయంలో ఇదే మాట వినిపిస్తోంది. నిజానికి గ్లామర్ పాత్రల నుంచి కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగిన ఈ హాట్ బ్యూటీ, దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె దాదాపు ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటోందని టాక్. అయితే ఆమెకు నిర్మాతల సంఘం భారీ షాక్ ఇవ్వడానికి రెడీ అయిందట. సినీ వర్గాలు కూడా ఈ విషయంపై అవునంటున్నాయి.

నిజానికి ఆమె కోరిన మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సై అంటున్నా సరే, ఆమె పెట్టించే ఎక్స్‌ట్రా ఖర్చులపై మాత్రం సహనంగా ఉండలేక పోతున్నారట. నయనతార కోసం ప్రత్యేక క్యారవాన్, పర్సనల్ అసిస్టెంట్, బాడీగార్డులు, వాళ్లకు జీతాలు, మేకప్‌మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కారు డ్రైవర్ జీతం ఇవన్నీ నిర్మాతే ఇస్తున్నారట. నయనతార ఒక రోజు షూటింగ్‌కి వస్తే చాలు, అదనంగా రోజుకు రూ. 60 నుంచి 70 వేల దాకా నిర్మాత జేబు లోంచే ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసిందట. పైగా ఆమె ప్రియుడు వస్తే ఆ ఖర్చు కూడా నిర్మాత లకే భారంగా మారిందట. ఎవరైనా ఎంతని భరిస్తారు. అందుకే నిర్మాతల మండలిలో ఆమె ఖర్చుల గురించి చర్చ సాగుతోందట.

ఇంతకుముందు నిర్మాత రాజన్ కూడా నయనతార పారితోషికం గురించి మాట్లాడి చర్చకు తెరలేపారు. పారితోషికం చర్చ రావడంతో నిర్మాతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకున్నట్లు టాక్. క్యారవాన్, ఇతర ఖర్చులన్నీ హీరోయిన్ పారితోషికం నుంచే పెట్టుకునే నిబంధన తీసుకురావాలని చూస్తున్నారట. లేకుంటే ఇతర హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ నుంచే ఖర్చులను భరించాల్సిన నిబంధన పెట్టేస్తారని భయపడుతున్నారట. ఇప్పటికే ఒకటి, రెండు సినిమాలు చేతిలో పెట్టుకున్న నయన్ కి తాజా ఆరోపణల వల్ల కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందన్న టాక్ జోరందుకుంది. మరి ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."