Movies

బ్రహ్మాజీ లైఫ్ స్టైల్ చూస్తే షాక్ అవ్వాలసిందే

సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ఈ ఓ ఇంటర్యూలో చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కొన్ని సూచనలు పాటిస్తే,సినిమావాళ్ళ సూసైడ్స్ ఉండవన్నది స్పష్టం అవుతోంది. సినిమాల్లో వరుస ఛాన్స్ లు వస్తుంటే,అంతానేనే అనుకునేవాళ్లు తనకళ్లముందే ఎలా వెళ్లిపోయారో చూశానని బ్రాహ్మాజి చెప్పాడు. అంతా నావల్లే అనుకుంటే పతనం స్టార్ట్ అయినట్లేనని అన్నాడు. అలా అనుకున్న వాళ్ళు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం చూశానని అన్నాడు.

ఇక ఇండస్ట్రీలో అందరూ మంచి డైరెక్టర్లేనని,అందరూ తనకు మంచి ఛాన్స్ లు ఇచ్చారని బ్రహ్మాజీ చెప్పాడు. ‘కొత్తవాళ్లు వస్తుంటారు,పాతవాళ్ళు కనుమరుగైపోతారు ఈ విషయం తెల్సి మసలుకోవాలి. ఇది పర్మినెంట్ కాదు. షూటింగ్ ని ఉద్యోగంలానే చూస్తాను. షూటింగ్ అయ్యాక సామాన్యుడిలా అయిపోతాను. ఇక మణికొండలో అన్ని మార్కెట్స్ కి వెళ్తా. మా ఆవిడ ఫోన్ లో లిస్ట్ పంపిస్తుంది. సూపర్ మార్కెట్ లో కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తుంటాను. సూపర్ మార్కెట్ స్టాఫ్ అందరూ తనకు తెల్సు ‘అని చెప్పుకొచ్చాడు.

‘పదేళ్ల తర్వాత ఇప్పుడున్న సినీ జీవితం ఉండదని, అందుకే మన నిజమైన జీవితం ఏమిటో తెలుసుకుని ఉండాలి. జనం మీద పడిపోతారేమోనని చిన్న చిన్న కేరక్టర్స్ వేసేవాళ్ళు కూడా బయటకు రాకుండా బిగుసుకుపోతుంటారు. ఇదంతా సెలబ్రిటీ అనే ఫీలింగ్ తప్ప మరొకటి కాదు. జనాలు మీద పడిపోయి రక్కేసేంత లేదు. సూపర్ స్టార్స్ వెళ్ళినపుడు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్తే ఆటోగ్రాఫ్ లు,సెల్ఫీలు పెద్దగా ఉండవన్నది వాస్తవం’ అని బ్రహ్మాజీ చెప్పాడు. మన పనులు మనం చేసుకోవడం అలవాటు చేసుకుంటే,సినిమాలు ఉన్నాలేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు. ఎక్కడికైనా వెళ్తే జనం తారసపడి పలానా సినిమాలో బాగా చేశారని అంటూ,సెల్ఫీ అడుగుతారని దాంతో అయిపోతుందని ఇదే జీవితం అంటూ తాను ఎలా హ్యాపీ గా జీవిస్తున్నాడో వివరించాడు.