“ఆదిత్య మ్యూజిక్” హిస్టరీలో బన్నీ హవా గట్టిగా…చూస్తే ఖుషి అవుతారు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా బలం కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.అల్లు అర్జున్ నటించే సినిమాలకు అటు హిందీలో ఏ స్థాయిలో రికార్డు మిలియన్ వ్యూస్ వస్తాయో అలాగే మన తెలుగులో కూడా తన టీజర్,ట్రైలర్ మరియు పాటలకు అంతే స్థాయి మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.అలా ఇప్పటికే బన్నీ నటించిన చాలా సినిమాలు చాలా అరుదైన ఫీట్స్ అందుకున్నాయి.అయితే మన తెలుగు మ్యూజిక్ లవర్స్ కి అతి పెద్ద మ్యూజిక్ సంస్థ అయినటువంటి “ఆదిత్య మ్యూజిక్” గురించి బాగా తెలిసిందే.
ఆ మధ్యనే 10 మిలియన్ సబ్ స్క్రైబర్స్ దాటిన మొట్టమొదటి తెలుగు మ్యూజిక్ ఛానెల్ గా డైమండ్ ప్లే బటన్ ను కూడా సాధించారు.అయితే ఈ అతి పెద్ద ఛానెల్లో మోస్ట్ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వీడియోల జాబితా తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వే ఉండడం విశేషం.వీటిలో ఒకటి “డీజే” చిత్రం నుంచి సీటీ మార్ ఫుల్ వీడియో సాంగ్ ఉండగా మిగతా రెండు లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో” రాములో రాముల మరియు సామజవరగమన లిరికల్ వీడియో సాంగ్స్ ఉన్నాయి.ఈ దెబ్బతో బన్నీను సోషల్ మీడియా కింగ్ అని ఎందుకు అంటారో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు.
ఆదిత్య మ్యూజిక్ ఛానెల్లో టాప్ 5 వ్యూస్ రాబట్టిన వీడియోస్
1 ఫిదా – వచ్చిండే(241 మిలియన్లు) 2 సంవత్సరాల్లో
2 అల వైకుంఠపురములో – రాములో రాముల(216 మిలియన్లు) 2 నెలలు
3 అల వైకుంఠపురములో – సామజవరగమన(168 మిలియన్లు) 4 నెలలు
4 డీజే – సీటీ మార్(149 మిలియన్లు) 2 ఏళ్లలో
5 ఛలో – చూసీ చూడంగానే(143 మిలియన్లు) 2 ఏళ్లలో
