బ్రహ్మాజీ కొడుకు సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా ?నమ్మలేని నిజాలు
సినిమాల్లో వారసత్వానికి కొనసాగింపుగా నటుడు బ్రహ్మాజీ వారసుడు సంజయ్ రావు హీరోగా `ఓ పిట్ట కథ` మూవీతో పరిచయం అవుతున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మించారు. విశ్వంత్ దుద్దుంపూడి నిత్యాశెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తయి మార్చి 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటవారసుడు సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పిట్ట కథ లో థియేటర్ లో పని చేసే యువకుడిగా కనిపిస్తా నని చెప్పాడు. ‘బాలనటుడిగా `లిటిల్ సోల్జర్స్` లో ప్రయత్నించా. రెండో తరగతి లో ఉన్నప్పుడు నాన్న (బ్రహ్మాజీ) ఆడిషన్స్ కి తీసుకెళ్లారు. కుదరలేదు’అని చెప్పాడు.
బ్యాక్ గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అనుకుంటారు. కానీ అది అలా రాదు. అలా అనుకోవడం తక్కువ ఆలోచన. ప్లస్ 2 నుంచి సాయి ధరమ్ తేజ్ పరిచయం. తను చాలా కష్టపడ్డాడు. అంత సులువేమీ కాదు ఇక్కడ. నాకు కూడా అనుభవం అయ్యింది. నాలుగేళ్లు ఈ సినిమా కోసం వేచి చూశాను. బయటవాళ్లకు తెలీని కష్టమిది“ అని చెప్పాడు. సినిమా అంటే డాడీ వల్లనే. మర్చంట్ నేవీ జాబ్ వదిలేశాక పూర్తిగా నటనలోకి వచ్చా. బీఎస్సీ నాటికల్ సైన్స్ పూర్తి చేసి అటుపై యుకేలో మాస్టర్స్ చేశాను. రియో డి జెనీరో.. ఆమ్ స్టర్ డామ్ లో ఉద్యోగం చేశాను. ఆ టైమ్ లోనే ఏదో అసంతృప్తి. డబ్బు సంపాదన తప్ప ఇంకేమీ ఉండదా? అనిపించింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉందని చెప్పుకోవడం తప్ప ఇంకేదీ లేదేమో అనిపించింది. అందుకే క్రియేటివ్ సైడ్ రావాలని అనుకున్నా’ అని సంజయ్ చెప్పుకొచ్చాడు.
`కృష్ణ వంశీ, రవితేజ , నటనలోకి రావచ్చు కదా అని అడిగేవారు. 12వ తరగతి తర్వాత వాడే నిర్ణయించుకుంటాడు అనుకున్నారు నాన్న. అయితే విదేశాల్లో ఆరేళ్ల అనుభవం తర్వాత క్రియేటివ్ సైడ్ వచ్చేస్తాను అంటే నాన్నగారు ఓకే అన్నారు. నటన, దర్శకత్వం డీవోపీ ఏదీ అనుకోలేదు. బాంబే పంపించారు. మనోజ్ బాజ్ పాయ్, ఆషిశ్ గాంధీ వంటి ప్రముఖుల్ని ట్రైన్ చేసిన శిక్షకుడి వద్దనే నటన నేర్చుకున్నా. ఏడాదిన్నర శిక్షణ తర్వాత తెలుగు పరిశ్రమ శైలి ఉండాలని దేవదాస్ కనకాల వద్ద 6నెలల కోర్స్ చేశా. ఇక కృష్ణ వంశీ దగ్గర నక్షత్రం సినిమాకి చేరా. 24 క్రాఫ్టులు నేర్చుకుని రమ్మని, బేస్ లైన్ స్ట్రాంగ్ గా ఉండాలని ప్రోత్సహించారు’అని వివరించాడు.