టాలీవుడ్ యువ హీరోల House ఖరీదు ఎన్ని కొట్లో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చినవాళ్లు,బ్యాక్ గ్రౌండ్ తో నిలదొక్కుకున్నవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు తమ స్థాయిలో ఇళ్ళు సమకూర్చుకున్నారు. అందులో నేచురల్ స్టార్ నాని విషయం తీసుకుంటే,డైరెక్టర్ అవుదామని వచ్చి ,హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. వరుస హిట్స్ తో దూసుకెళ్తూ, తన కలలకు అనుగుణంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ విల్లా కొన్నాడు. గార్డెన్,పోర్టికో,బాల్కనీ,స్విమ్మింగ్ పూల్ ,వుడెన్ ఫర్నిచర్,ఇలా అన్నీ ఉన్న ఈ విల్లా ఖరీదు 5కోట్లు. అలాగే యంగ్ హీరో నితిన్ పెళ్ళికి ముందే సొంతంగా ఓ ఇంటిని సమకూర్చుకున్నాడు. మణికొండలో నాలుగు కోట్లకు పైగా వెచ్చించి కొన్న ఇంటిలో అన్ని వసతులు ఉన్నాయి.
కాగా నాగచైతన్య ఆమధ్య సమంతను చేసుకున్నాక వేరే ఇంటికి మారాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే కొత్తగా కొన్న ఈ ఇల్లు 16కోట్లు ఖరీదు చేస్తుందని అంటున్నారు. అలాగే ముంబయిలో కూడా ఓ ఇల్లు ఇతడికి వుంది. పనులమీద వెళ్ళినపుడు వీలుగా ఉండేలా అక్కడొక ఇల్లు సమకూర్చుకున్నాడు. బాహుబలితో భళ్లాలదేవుడిగా గుర్తింపు పొందిన రానా ఇల్లు చూస్తే,స్పెషల్ ఎట్రాక్షన్. ఫిలిం నగర్ లోని ఎత్తైన కొండమీద గల ఈ ఇంటిలో పేరెంట్స్ తో కల్పి ఉంటున్నాడు. అయితే ఈమధ్య కొంచెం ఆధునీకరించారు. మంచి గార్డెన్,విశాలమైన గదులు,మంచి వెలుతురులో డాక్టర్ రామానాయుడు నిర్మించిన ఇల్లు ఇది. దీని ఖరీదు 30కోట్ల దాకా ఉంటుంది.
ఏలూరుకు చెందిన నాగసౌర్య 2011లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మణికొండలో కోటిన్నర విలువచేసే ఇంటిని కొన్నాడు. నెమ్మదిగా పెద్ద ఇల్లు కొనాలన్న యోచనలో ఉన్నాడట. 2014లో ముకుందతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం ఉమ్మడిగానే ఉంటున్నాడు. ఆ ఇంటి ఖరీదు నాలుగు కోట్లు ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇల్లు కొంటాడో చూడాలి. 2004నుంచి ఇప్పటిదాకా 33సినిమాల్లో నటించిన శర్వానంద్ సినిమాల్లోకి రాకముందే అతని తండ్రి వ్యాపారంలో స్థిరపడ్డం వలన నాలుగుకోట్ల విలువచేసే ఇల్లుంది. ఇప్పటివరకూ 40సినిమాల్లో చేసిన నవదీప్ ఇల్లు చూస్తే వావ్ అంటాం. హైదరాబాద్ లో నాలుగు ఫ్లోర్ ల బిగ్ హౌస్ ఉంది. మంచు విష్ణు ఇద్దరు కవలపిల్లలకు తండ్రి అయ్యాక భార్య వెరోనికా గిఫ్ట్ గా జూబ్లీ హిల్స్ లో కళ్ళు చెదిరే ఓ ఇల్లు కట్టించి ఇచ్చింది. దీనివిలువ పాతిక కోట్లపైనే ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరో అవ్వాలని కలలు కన్న హీరో కార్తికేయ ఆర్ ఎక్స్ 100మూవీతో హీరో అయ్యాడు. కోటి రూపాయల విలువైన ఇల్లు ఇతడి ఫ్యామిలీకి ఉంది.

