రాత్రికి రాత్రే హోటల్ రూమ్ బాయ్ జీవితాన్ని మార్చేసిన ట్రంప్ కుటుంబ సభ్యులు
భారత్ పర్యటనకు ఫ్యామిలీతో వచ్చిన అగ్ర రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ రెండు రోజులపాటు దేశంలోనే ఉన్నారు. 24న ఇండియాకు వచ్చిన ట్రంప్ గుజరాత్ లోని సంబర్మతి ఆశ్రమాన్ని సతీసమేతంగా సందర్శించారు. అక్కడి విశేషాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన వెంట ఉన్నారు. ఆతర్వాత మొతేరా స్టేడియంలో నమస్తే మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆతర్వాత ఆగ్రా చేరి,తాజ్ మహల్ అందాలను ట్రంప్ ఫామిలీ ఆస్వాదించింది.
రాత్రి ఢిల్లీ చేరిన ట్రంప్ ఫామిలీ అక్కడి మౌర్య హోటల్ లో విడిది చేసారు. హోటల్ సిబ్బందితో ట్రంప్ ఫామిలీ సరదాగా గడిపారు. ముఖ్యంగా ఇవాంక హోటల్ అంతటా కలియదిరిగి అక్కడి స్పెషాల్టీస్ అన్నీ తెలుసుకుంది. నిద్రించే ముందు కాఫీ తాగే అలవాటు గల ట్రంప్ కి కాఫీ తెమ్మని హోటల్ సిబ్బందికి ఆర్డర్ చేసారు. చెఫ్ ప్రత్యేకంగా కాఫీ తయారుచేసి రూమ్ బాయ్ తో పంపించారట. అలా కాఫీ తెచ్చిన రూమ్ బాయ్ తో మాటలు కల్పిన ట్రంప్ అతడి బాగోగులు అడిగి తెలుసుకున్నారట.
అయితే రూమ్ బాయ్ లోలోపల దిగులుని గమనించి అతడి సమస్యను హోటల్ నిర్వాహకుల ద్వారా తెలుసుకుని ట్రంప్ చాలా విచారించారట. దీంతో రూమ్ బాయ్ ని మళ్ళీ రూమ్ కి పిలిచి అతడి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మరోసారి అడిగి తెలుసుకున్నారట. తనకు వచ్చే జీతం హాస్పిటల్ ఖర్చులకే సరిపోవడం లేదని, అప్పు చేయాల్సి వస్తోందని,చాలా కష్టంగా ఫ్యామిలీని నెట్టుకొస్తున్నట్లు రూమ్ బాయ్ వివరించాడట. దీంతో అక్కడికక్కడే ఆర్ధిక సాయం చేశారట ట్రంప్. అలా ఒక్కరాత్రిలోనే అతడి జీవితాన్ని మార్చేశారని తెలుస్తోంది.

