Movies

బాలయ్య ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండ్. సినీ హీరోగా అలాగే రాజకీయ నేతగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. పలు హిట్ చిత్రాలతో అభిమానులను అలరించిన బాలయ్య తెలుగుదేశం నాయకునిగా అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నైకయ్యాడు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన బాలయ్య పాపులార్టీ ఏమిటంటే, సినిమా హిట్ అయినా,కాకున్నా ఫాన్స్ మాత్రం అలాగే ఉంటారు. ఏ సినిమా రిలీజ్ అయినాసరే,జై బాలయ్య బాబు అని ఫాన్స్ నిందిస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

ఎన్టీఆర్ పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పేదలకు సేవలందిస్తున్నాడు. ఉచితంగా వైద్యం ,చదువు అందిస్తున్నాడు. అయితే బాలయ్య ఒక్కొక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు,ఏడాది నెట్ వర్త్ ఎంత, అతడి టోటల్ ఆస్థి ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే, సినిమాలు, బిజినెస్ ఆధారంగా ఏడాదికి నెట్ వర్త్ 30 కోట్లు గా చెబుతారు.