Movies

ఈ హీరో గుర్తు ఉన్నాడా…సినిమాలకు దూరంగా ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

మన తెలుగు చిత్ర సీమ హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ లో ముందుకు వెళ్తుంటారు. అయితే కొందరి కెరీర్ అనుకోకుండా ముగిసిపోతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా అనే చిత్రంలో హీరోగా నటించిన రాజా విషయం చెప్పాలి. ఈ చిత్రంతో రాజా మంచి సైలెంట్ హిట్ ని అందుకున్నాడు.అయితే దాదాపుగా తెలుగులో 20కి పైగా చిత్రాలకుపైగా నటించిన రాజా ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకి చాలా దూరంగా ఉంటున్నాడు.అంతేగాక చివరగా రాజా 2012వ సంవత్సరంలో మంచు మనోజ్ నటించిన టువంటి మిస్టర్ నూకయ్య చిత్రంలో విలన్ గా కనిపించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజా గురించి ఓ వార్త నెట్ లో వైరల్ అవుతుంది.ఇంతకీ అదేంటంటే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో అప్పట్లో హీరో రాజాకి మంచి సంబంధాలు ఉండేవన్న వార్తలు వినిపిస్తు న్నాయి.అంతేగాక వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహితంగా ఉండే పలువురు దర్శకులు అప్పట్లో రాజాకీ పలు సినిమా ఆఫర్లను కూడా పిలిచి ఇచ్చేవారట.

ఇదే ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూతురుతో కూడా హీరో రాజా ప్రేమాయణం సాగించినట్టు వార్తలు నెట్లో వైరల్ అయ్యాయి. అయితే ఎప్పుడైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించారో అప్పటినుంచి హీరో రాజా కి సినిమా అవకాశాలు కరువయ్యాయని, అంతేగాక ఎమ్మెల్యే కూతురు కూడా హ్యాండ్ ఇచ్చిందని, ఆ విధంగానే హీరో రాజా టాలీవుడ్ సినీ పరిశ్రమకి దూరమయ్యాడని పలువురు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా హీరో రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.అంతేగాక క్రిస్టియన్ మతంలో చేరి మత ప్రచార బోధకుడిగా బిజీ అయ్యాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."