Movies

కృష్ణ తల్లికి శోభన్ బాబు పెద్ద కొడుకు..ఎవరికి తెలియని ఈ బంధం వెనక రహస్యం

సినిమా ఇండస్ట్రీలో నందమూరి,అక్కినేని తర్వాత అంతలా ఫ్రెండ్ షిప్ తో సినీ రంగంలో దూసుకెళ్లినవాళ్లు సూపర్ స్టార్ కృష్ణ,నటభూషణ శోభన్ బాబు. కృష్ణకి ఫాన్స్ ఎక్కువ ఉంటె, అందాల నటుడుగా ఆడవాళ్ళలో శోభన్ బాబుకి ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. వీరిద్దరూ కల్సి ఎన్నో మల్టీస్టారర్ మూవీస్ లో నటించారు. ఇందరి మధ్యా కూడా కొంత పోటీ ఉండేది. కృష్ణ 350మూవీస్ లో నటించగా, శోభన్ బాబుకి అన్ని సినిమాలు లేకుండా ఫ్యామిలీ హీరోగా ఎక్కువ మూవీస్ చేసాడు.

మండే గుండెలు,ముందడుగు,కృష్ణార్జునులు ,మహా సంగ్రామం,ఇద్దరు దొంగలు సినిమాల్లో కృష్ణ ,శోభన్ బాబు కల్సి నటించారు. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న మల్టీస్టారర్ మూవీస్ మరెవ్వరికీ లేవు. శోభన్ బాబుని ప్రతి ఇంట్లో కొడుకుగా భావించేవారట. అంతెందుకు తన ఇంట్లో సూపర్ స్టార్ ఉన్నా సరే,తన పెద్ద కొడుకు శోభన్ బాబు అనేవారట కృష్ణ తల్లి. అంతటి మంచి అభిప్రాయం శోభన్ బాబు మీద ఉండేది.

ఇక కురుక్షేత్రం మూవీలో శోభన్ బాబు కృష్ణుడు వేషం వేసాడు. స్వయంగా భగవంతుడే దిగి వచ్చాడా అని అందరూ ఫీలయ్యారట. అప్పటినుంచి కృష్ణ తల్లి నాగరత్నమ్మ తన ఇంట్లో శోభన్ బాబు ఫోటో పెట్టుకునేది. ఏ విషయమైనా ఎంతో డిసిప్లీన్ గా వుండే శోభన్ బాబు ఖచ్చితత్వాన్ని మారుపేరుగా ఉండేవాడట. కురుక్షేత్రంలో ఓ ఫైట్ కోసం లండన్ నుంచి కెమెరాలు రప్పించి షూట్ చేశారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."