Movies

సుమ,ఝాన్సీలకు అప్పట్లోనే టఫ్ ఇచ్చిన ఆ యాంకర్ ఎవరు?

ప్రస్తుతం మన తెలుగులో ఉన్నటువంటి యాంకర్స్ లో టాప్ ఎవరు అంటే అది ఎలా లెక్కేసుకున్నా సరే సుమ పేరే వినిపిస్తుంది.అయితే సుమ ఎప్పటి నుంచి యాంకర్ గా ఆకొనసాగుతున్నారో అందరికీ తెలుసు.దాదాపు దశాబ్దంన్నర పాటుగా తెలుగు బుల్లితెర మీద కనిపించి అలరించారు.

అయితే అప్పట్లో సుమతో పాటుగా మరో టాప్ యాంకర్ ఝాన్సీ కూడా కనిపించే వారు.ఎక్కువగా వీరిద్దరి షోలే తెలుగు ప్రేక్షకులకు కనిపించేవి కానీ వీరిద్దరికీ మాత్రం తాను గట్టి పోటీ ఇచ్చే వాడిని అని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాను ఇంకా సంగీత దర్శకత్వంలోకి పూర్తి స్థాయిలో దిగక ముందు హైదరాబాద్ లో హీరోలకు డబ్బింగ్ అంటే నేనే అని అలా ఆ సమయంలో యాంకర్ గా కూడా చేసానని అప్పటికే సుమ ఝాన్సీలు యాంకర్లుగా బాగా రాణిస్తాన్నారని అప్పుడు మేల్ యాంకర్ నేనెక్కొడినే ఆ రంగంలో కూడా అప్పుడు నాకు తిరుగు లేకుండా పోయిందని అప్పుడు మా మధ్యనే చాలా టఫ్ కంపిటిషన్ ఇచ్చేవాడినని వారే అనేవారని రఘు తెలిపారు.