Health

హమ్మయ్య… చికెన్ ప్లేస్ లో ఇది తింటే మంచిదా..!

గత కొంతకాలంగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ ఏ జీవి నుండి ఉద్భవించిందో శాస్త్రవేత్తలుస్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలలో అనేక వదంతలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా నాన్ వెజ్ తింటే కరోనా రావొచ్చు అనే వార్త వల్ల భారత్ లో పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ.25 పలికిందంటే.. ప్రజలలో ఆ చికెన్, మటన్ భయం ఎంత మోతాదులో ఉందో అర్థంచేసుకోవచ్చు.

కరోనా దెబ్బతో చికెన్, మటన్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి. అయితే చికెన్, మటన్ బదులు ఏంతినాలి అని ప్రజలు వాటికి ప్రత్యామ్యాయాన్ని వెతుకుతున్నారు. అందులో భాగంగా చాలామంది చికెన్, మటన్‌ లకు బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా పనస పండుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా పనస పండుకు కిలో రూ.50 ఉండేది, కానీ ఇప్పడు ఒక్కసారిగా అమాంతం కిలో రూ. 120కి చేరింది. అదే చికెన్ ధర కిలో రూ. 50 లోపే ఉంది.

పనస పండు తినడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. చర్మాన్ని ముడతలు పడుకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును పెంచడంతోపాటు.. మంచి జుట్టును కూడా ఇస్తుంది. అంతేకాకుండా.. జీర్ణశక్తిని పెంచడానికి కూడా పనస బాగా పనిచేస్తుంది.

కరోనా వైరస్ చికెన్, మటన్ లేదా చేపల వినియోగం వల్ల వ్యాప్తి చెందదని వైద్యులు, పోషకాహార నిపుణులు పదేపదే చెప్తున్నా కూడా ప్రజలు తమ అనుమానాన్ని వదలడం లేదు. త్వరలోనే ప్రజలలో ఈ విషయంపై అవగాహన వస్తుందని డాక్టర్లు అభిప్రాయపడతున్నారు.