Movies

చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్‌ స్టార్ హీరోల భార్యలు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అది ఇది అనికాకుండా అన్నింటా దూసుకుపోతున్నారు. మగాళ్లతో పోటీ వస్తున్నారు. ఈ ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీ ని కూడా తాకింది. హీరోల విషయంలో వాళ్ల భార్యల ఆధిపత్యం ఎక్కువేనట. దాన్ని డామినేషన్ అనాలో జాగ్రత్త అనాలో తెలీడం లేదు. నిజానికి బాలీవుడ్ హీరోలతో సమానంగా నే కాదు, అక్కడి వాళ్ల కంటే ఎక్కువగా మన వాళ్లు పారితోషికం తీసుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అయితే సినిమాకు 50 నుంచి 60 కోట్ల వరకు దక్కించుకుంటున్నారు. హీరోల భార్యల కారణంగా కొందరు నిర్మాతలు మాత్రం భయపడుతు న్నారట. ప్రతీ విషయంలో కూడా వాళ్ల ఇన్వాల్వ్‌మెంట్ ఉండేసరికి కాస్త మొహమాటపడుతున్నారని టాక్.

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అయితే, మహేష్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ముఖ్యంగా ఆయనతో సినిమా చేయాలంటే నమ్రత ఓకే చెప్పాల్సిందే. లేదంటే ప్రాజెక్ట్ పక్కకి పోయినట్టే. ఒక్కోసారి కథలో కూడా ఆమె సూచనలు ఇస్తుందనే టాక్ నడుస్తోంది.నమ్రత తీరుతో కొందరు నిర్మాతలు అసహనం వ్యక్తం చేసారనే వార్తలొస్తున్నాయి. కానీ మహేష్ బాబు తన కెరీర్ పూర్తి బాధ్యత నమ్రత చేతుల్లోనే పెట్టేసాడు. ఆమె వచ్చిన తర్వాతే సోషల్ మీడియా సహా అన్నింట్లోనూ మహేష్ రేంజ్ పెరిగిపోయింది.

ఇక సినిమాల డేట్స్ విషయంలో అయితే పర్లేదు కానీ ఏకంగా కథల విషయంలో కూడా వేలు పెట్టే హీరోల భార్యలు కూడా ఉన్నారట. వరస విజయాలతో దూసుకుపోతున్న ఓ హీరో భార్య అయితే నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. మీ భార్య గారు వేలు పెట్టకపోతేనే మీతో సినిమా చేస్తామని సదరు హీరోకు నిర్మాతలు అర్జీ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలే నిర్మాతలుగా మారుతుండటంతో అన్నింట్లోనూ వాళ్ల పెత్తనమే కనిపిస్తుంది. దాంతో పాటు హీరోల భార్యలు కూడా అంతా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

నిర్మాణంలో భాగస్వామ్యంతో పాటు కథలో కూడా దూరిపోయి మార్పులు చేర్పులు చెప్పడం వలన దర్శకులకు పిచ్చెక్కిపోతుందని కొందరి వాదన. చైతూ కెరీర్ విషయంలో ముందు సమంత పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు ఆమె కూడా చైతూను దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టిందని,. కథల విషయంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతుందని ప్రచారం జోరందుకుంది. ఇక మరో ఇద్దరు స్టార్ హీరోల భార్యలు కూడా దర్శకులకు తమ అతి తెలివితో చుక్కలు చూపిస్తున్నారని టాక్. హీరోల భార్యలు వేలు పెట్టడం మానితే కానీ కథలు బాగా రావని కొందరు దర్శకులు తేల్చేస్తున్నారు. మరి ఈ ఒరవడి ఇక్కడితో ఆగుతుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."