పూరి జగన్నాథ్ కూతురు గురించి షాకింగ్ నిజాలు

టాలీవుడ్ లో ఎంతమంది గొప్ప దర్శకులు ఉన్నా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ అయ్యాడు. అయితే మనకు పూరీ జగన్నాథ్ గురించి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయన కుటుంబం గురించి అంతలా తెలీదు. అందులోను ఆయన పిల్లల గురించి. కొడుకును మనం సినిమాలలో చూస్తున్నాం కానీ అయన కూతురు గురించి ఎవరికీ ఎలాంటి విషయాలు తెలీదు..ఒక్కసారి ఆయన కూతురు వివరాల్లోకి వెళ్తే..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూతురు పేరు పవిత్ర పూరి. పవిత్ర ఒక నటి అన్న విషయం చాలామందికి తెలీదు. ఈమె ఒక సినిమాలో మాత్రమే నటించింది. అది కూడా వాళ్ల నాన్న డైరెక్ట్ చేసిన బుజ్జిగాడు సినిమాలో కనిపించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్, కూతురు పవిత్ర ఇద్దరు యాక్ట్ చేశారు. బుజ్జిగాడు సినిమాలో పూరి కొడుకు ఆకాష్ ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తే.. కూతురు పవిత్ర త్రిష చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాలో వారి ద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆకాష్ చాలా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు. కానీ పూరి కూతురు పవిత్ర మాత్రం ఆ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. తండ్రి తీసుకురాలేదో, లేక ఆమెకు ఇంట్రస్ట్ లేదో కానీ మరే సినిమాలో కూడా నటించలేదు. సినిమాలలో అయితే నటించలేదు కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది పవిత్ర. ఎప్పటికప్పుడు తన పిక్స్ ని, తన ఫ్యామిలీకి సంబంధించి పిక్స్ కు, తన తండ్రి సినిమాలకు సంబందించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… పవిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. తన తండ్రి పూరి జగన్నాథ్ బాలకృష్ణతో చేసిన పైసా వసూల్ మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది పవిత్ర. తండ్రి లాగానే ఆమెకు కూడా డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉందంట . అందుకే తండ్రి దగ్గరే అసిస్టెంట్ గా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం డైరెక్షన్ కు సంబంధించి కొన్ని కోర్స్ లు నేర్చుకునే పనిలో ఉంది. అక్కడ కోర్స్ లు కంప్లీట్ అయ్యాకా మళ్ళి తండ్రి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యాలనుకుంటుంది. మొత్తమీద పూరీ జగన్నాథ్ తన ఇద్దరు పిల్లలను సినిమాల వైపే తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. కొడుకు ఆకాష్ ఇప్పటికే హీరోగా చేస్తూ బిజిబిజిగా ఉన్నాడు. ఇక కూతురు కూడా త్వరలో డైరెక్షన్ వైపు రానుంది. ఎలాగో తెలుగు ఇండస్ర్టీలో లేడి డైరెక్టర్స్ తక్కువమంది ఉన్నారు. పవిత్ర డైరెక్టర్ గా వచ్చి మంచి హిట్స్ కొట్టి తన తండ్రి లాగానే పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుందాం.