Movies

జబర్దస్త్ వినోద్ పెళ్లి ఎప్పుడు…ఎవరిని చేసుకుంటున్నాడో తెలుసా?

ప్రతి గురు,శుక్ర వారాల్లో ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్ లు వేస్తూ తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో ఎంతగానో అలరించే టువంటి వినోద్ అలియాస్ వినోదిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వినోద్ ఒక జబర్దస్త్ లోనే కాక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు.

అయితే తాజాగా జబర్దస్త్ వినోద్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా పలు అంశాలను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా తాను తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నానని పెళ్లికూతురు తన సమీప బంధువు అని తెలిపాడు.అలాగే ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయినట్లు కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే తాజాగా తన పై దాడి జరగడంతో పెళ్లిని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవలసి వచ్చిందని తెలిపాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నడంతో మరోమారు తన పెళ్ళి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ పూనం పాండే నటిస్తున్న ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నాడు.

అయితే అతి తక్కువ కాలంలో బాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకున్న జబర్దస్త్ వినోద్ ఈ చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నాడు.అయితే మొదట్లో తనకు అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ షోని వదలకుండా అందులో కూడా నటిస్తున్నాడు.ఒకవైపు జబర్దస్త్ షో మరొకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."