ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి

సెలబ్రిటీల అంశాలు ఏదైనా సరే,భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న చిన్నపాప ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ ఫొటోలో గల పాప ఇప్పుడు సూపర్ స్టార్ గా మారి, సీనియర్ హీరోయిన్ హోదా కూడా అందుకుంది. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల వరకు నటించింది.

ఇక 80ల్లోనే వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళ తదితర భాషల్లో కలిపి వందల సినిమాల్లో నటించింది. అంతేకాదు, ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. మరోవైపు రాజకీయాలు కూడా యాక్టివ్ గా ఉంది.

రెండు రంగాల్లోనూ సత్తా చూపించిన ఈ హీరోయిన్ మరెవరో కాదు ఖుష్బూ సుందర్. వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ఆ తర్వాత తమిళంలో సూపర్ స్టార్ అయిపోయింది. తొలిసారి ఓ హీరోయిన్‌కు గుడి కట్టేంత అభిమానం సంపాదించుకుంది. బొద్దు అందాలతో దశాబ్ధంన్నర పాటు తమిళ ప్రేక్షకులను అలరించింది.