Movies

ప్రొడ్యూసర్ తో అంజలి వివాదం సమసిపోయిందా లేదా…కెరీర్ పరిస్థితి ఏమిటో…?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైన తెలుగమ్మాయి అంజలి కెరీర్ మంచి పీక్ లో ఉండగా లవ్ స్టోరి నడిచింది. యువ తంబీ హీరో జై తో అంజలి ప్రేమాయణం గురించి గడిచిన కొన్నేళ్లుగా హాట్ టాపిక్ అయింది. ఆ కాంబినేషన్ లో వరుసగా సినిమాలు తెరకెక్కడంతో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని అటుపై కలిసే జీవిస్తున్నారని టాక్ నడిచింది. ఇక ఈ జంటతో సినిమా తీసిన ఓ నిర్మాతే ఏకంగా వాళ్లిద్దరి చాటు మాటు వ్యవహారాలను బట్టబయలు చేసాడు. నిర్మాత కళ్లు కప్పి సెట్స్ నుంచి ఎస్కేప్ అయ్యారని, చెట్టా పట్టాలేసుకుని తిరిగారని, ఒకే రూమ్ లో గడిపారని, అలా షూటింగ్ డుమ్మా కొట్టడం కారణంగా లక్షల రూపాయాలు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పేసాడు.

అంతకు ముందు ప్రేమ నిజమే, పెళ్లి చేసుకోవడం ఖాయమేననే బలమైన కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అంతేనా ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారని కూడా అంతే జోరుగా టాక్ నడిచింది. అయితే ఏనాడు దీనిపై అంజలి స్పందించ లేదు. అంతేకాదు, జై సైతం మౌనంగా ఉండటంతో ఈ ప్రచారమంతా నిజమేనని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. తాజాగా మీది లవ్ ఫెయిల్యూర్ అని విన్నాం అంటూ ఈ భామను ఓ విలేకరి ప్రశ్నించగా, అంజలి సైతం అంతే వేగంగా తడబడకుండా సమాధానం ఇచ్చింది. “నాది లవ్ ఫెయిల్యూర్ కాదు. అసలు నేను ప్రేమలోనే పడలేదు. జై మంచి స్నేహితుడు మాత్రమే. ఇద్దరం ప్రేమలో ఉన్నట్లు గానీ, పెళ్లి చేసుకుంటున్నట్లు గానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదే! మా మధ్య ఏదో రిలేషన్ ఉందని, పెళ్లి చేసుకుంటున్నామని, విడిపోయామని…. ఇవన్నీ మీడియా ఊహాగానాలే. నిజానికి ఆ వార్తలకు అంత సీన్ లేదు’అని తేల్చేసింది.

‘అయినా ఒక హీరోతో కలిసి రెండు.. మూడు సినిమాలు చేస్తే ప్రేమలో పడిపోతామా?“ అంటూ అంజలి ఎదురు ప్రశ్నించింది. మా మధ్య స్నేహం చూసి కోలీవుడ్ లో మీరు అనుకుంటోన్న ఓ నిర్మాత మీలాగానే అనుకుని ఉండొచ్చు.. అంటూ రివర్స్ పంచ్ విసిరింది. అంతేకాకుండా తన గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నిర్మాత గురించి అంజలి తనదైన శైలిలో స్పందించింది. “మాది ఎఫైర్ అనేది ఆయన అభిప్రాయం కావొచ్చు. కానీ దానిని నేను ఖండించను. ఆయన ఎలా అనుకున్నా పర్వాలేదు. మాది స్నేహం. అంతకు మించి మరే ఇతర బంధం లేదు“ అని స్పష్టం చేసేసింది. అయితే సదరు నిర్మాత అప్పట్లో చేసిన వ్యాఖ్యలు నిజమేనని అవి ఆరోపణలు కానే కాదని…ఇద్దరూ రహస్యంగా ఒకే రూమ్ లో గడపడం నిజమేనని అంజలి వ్యాఖ్యలను బ్టటి మరోసారి కోలీవుడ్ మీడియాలో కథనాలు రన్ అవుతున్నాయి.