Movies

RRR రిలీజ్ పై దానయ్య షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఈయన నిర్మాణంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం నడుస్తున్న లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా విడుదల మరోసారి వాయిదా పడనుందనే వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ తో షూటింగ్ నిలిచిపోవడంతో రాజమౌళి తన సినిమా రిలీజ్ మరోసారి వాయిదా వేసాడని వార్తలు వినిపించాయి. దీంతో నిర్మాత డివివి దానయ్య స్పందించాడు. నిజానికి ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే కాస్త నెమ్మదిగానే జరుగుతుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా కరోనా కారణంగా నెల రోజులకు పైగానే షూటింగ్ రద్దయింది.

ఇలా షూటింగ్ కేన్సిల్ కావడంతో జనవరి 8న ఈ చిత్రం రావడం కష్టమే అని.. జులైకి పోస్ట్ పోన్ అయిందనే టాక్ సహజంగానే వస్తోంది. ఈ సినిమాలో అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. నిజానికి ఈ స్వాత్రంత్య్ర సమరయోధులిద్దరూ చరిత్రలో తారసపడలేదు. ఒకవేళ కలుసుకుని ఉంటే ఎలా ఉండేదనే ఫిక్షన్ కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.దాదాపు 300 కోట్లతో డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

ఇక సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న తరుణంలో నిర్మాత క్లారిటీ ఇస్తూ, “నిజానికి ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల కావల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా పడింది. అయితే ఈ సారి సినిమా వాయిదాపడే ఛాన్సే లేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే జనవరి 8న రిలీజ్ అవుతుంది. కరోనా ఎఫెక్ట్ తమ సినిమాపై ఉండదు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. అందుకే ఈ సారి వాయిదా వేసేందుకు ఎలాంటి కారణం లేదు”అని చెప్పుకొచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."