Movies

బోయపాటి శ్రీనుకి ఇప్పుడైనా సారీ చెప్తారా చరణ్ ఫ్యాన్స్.?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రాల జాబితాలో లేటెస్ట్ “వినయ విధేయ రామ” సినిమా కూడా ఒకటి. మాస్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గత ఏడాది ప్లాప్ గా నిలిచిపోయింది. అయినప్పటికీ వసూళ్ల సునామీని సృష్టించింది.

ఈ విషయం పక్కన పెడితే అసలు ఈ చిత్రం విడుదల సమయంలో వచ్చిన హైప్ వేరే లెవెల్ అని చెప్పాలి. కానీ ఈ సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో కాకుండా ఊహలకు అందని రేంజ్ లో ఉండేసరికి బోయపాటి శ్రీనుని తిట్టుకోని అభిమానులు లేరు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ మరీ దారుణంగా ఉండడంతో కేవలం బోయపాటి శ్రీను వల్లే ఈ సినిమా పోయిందని ఆ నింద మొత్తం ఆయన మీదే తోసేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా అక్కడ ఫెయిల్ అయినా బుల్లి తెర మీద మాత్రం మన టాలీవుడ్ ఏ సినిమాకు రాణి టీఆర్పీ రికార్డులను కొల్లగొడుతుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని స్టార్ మా మొత్తం 5 సార్లు టెలికాస్ట్ చెయ్యగా మొదటి రెండు సార్లు వరుసగా 8 టీఆర్పీ రేటింగ్ మిగతా అన్ని సార్లు 7 కు తగ్గకుండా వచ్చింది. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదని చెప్పాలి.చరణ్ తో ఉన్న మిగతా స్టార్ హీరోలకు ఎవరికీ ఈ ఫీట్ సాధ్యం కాలేదు. చరణ్ ఒక్కడికే అందులోను ఈ సినిమాతోనే సాధ్యం అయ్యింది. మరి ఇలాంటి సినిమాను అందించిన బోయపాటి శ్రీనుకు ఇప్పుడు చరణ్ అభిమానులు సారీ చెప్పాలిగా మరి..