Movies

టాలీవుడ్ హీరోలు… ఒక్కొక్కరు ఎంత విరాళం ఇచ్చారో చూడండి

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్లని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. రెండు కోట్ల రూపాయల్లో ఒక కోటి ప్రధాని సహాయనిధికి, 50 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి ఇస్తున్నట్టు తెలిపారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4 కోట్లు విరాళంగా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి రూపాయలు, ప్రధానమంత్రి సహాయనిధికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 75 లక్షల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 25 లక్షలు, మిగతా రూ. 25 లక్షల‌ను తెలుగు సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాని సహాయ నిధితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. 70 లక్షలను ఇస్తున్నట్టు తెలిపారు. హీరో నితిన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు.