Movies

మరో రెండు సరికొత్త సినిమాలతో జెమినీ టీవీ.!

ప్రస్తుతం మన తెలుగు ఛానెల్స్ ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా వినియోగించుకోడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తవి పాతవి అని లేకుండా అన్నిటితోను అదరగొట్టేస్తున్నాయి. అయితే ఈ సమయంలో వీక్షకులు మాత్రం ఎక్కువగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.

అందులో భాగంగా సరికొత్త సినిమాలు ఏ ఛానెల్లో వస్తున్నాయా అని చూస్తున్నారు. కానీ ఈ సమయంలో జెమినీ టీవీ ఛానెల్ మాత్రం దూసుకుపోతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా వచ్చిన భారీ సినిమాలతో రెడీగా ఉంటూనే పలు చిన్న సినిమాలను కూడా టెలికాస్ట్ కు సిద్ధం చేస్తుంది.

అయితే ఇప్పుడు మరిన్ని సినిమాలతో జెమినీ ఛానెల్ సిద్ధంగా ఉంది. టాలీవుడ్ అండర్ రేటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన మాస్ థ్రిల్లర్ “తిప్పరా మీసం” అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన “లోకల్ బాయ్” సినిమాలను రాబోయే రెండు శుక్రవారాల్లో టెలికాస్ట్ చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ లో టెలివిజన్ వీక్షకులకు ఈ చిత్రాలు కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.