స్వాతి వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్స్ లో నిజం ఎంత?
తెలుగు బుల్లి తెరపై సంచలన తారగా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ స్వాతి.హీరోయిన్‌గా ఈమె నటించి పలు చిత్రాలతో మెప్పించింది.ఇక ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోయిన్‌గా ఆకట్టుకుంది.ఈమె నటించిన స్వామిరారా ఇంకా కార్తికేయ సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి.
అయితే తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్లు రావనే విషయం ఈమె విషయంలో మళ్లీ నిజం అయ్యింది.స్వాతికి తక్కువ సమయంలోనే ఆఫర్లు లేకుండా పోయాయి.దాంతో ఆమె పెళ్లి చేసుకుంది. తన సోదరుడి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఏడాది పాటు సంతోషంగానే కాలం గడిపినా కూడా తర్వాత నుండి ఇద్దరి మద్య వివాదాలు, విభేదాలు వచ్చాయట.
పైలెట్ అయిన అతడి ప్రవర్తన స్వాతికి విసుగు తెప్పించిందట.అతడిని ఏ విషయం అడిగినా కూడా ఉద్దేశ్యపూర్వకంగా గొడవకు దిగేవాడట.దాంతో స్వాతి అతడి నుండి దూరం అయ్యింది.ప్రస్తుతానికి ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు.
కుటుంబ సభ్యులు కలపాలని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
ప్రస్తుతం వీరిద్దరు కూడా అధికారికంగా విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారు.వీరి వైవాహిక జీవితం సాఫీగా ఏడాది కాలం సాగలేదు అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భర్తతో విడిపోయిన స్వాతి మళ్లీ సినిమాలకు రెడీ అవుతుంది. త్వరలో ఈమె కార్తికేయ 2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.ఇదే సమయంలో ఈ అమ్మడు తమిళంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యింది.గతంలోనే ఈమె హీరోయిన్‌గా సక్సెస్ అవ్వలేక పోయింది.మరి ఇప్పుడు ఆంటీ అయిన తర్వాత హీరోయిన్‌గా సక్సెస్‌లు వచ్చేనా చూడాలి.
