Movies

చిరంజీవి తండ్రి ఒడిలో గల మెగా హీరో ఎవరో గుర్తు పట్టారా?

కంటికి కన్పించని శత్రువుగా మారిన కరోనా మహమ్మారితో లాక్ డౌన్ పొడిగించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలందరూ ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు అప్పటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ దానికో క్యాప్షన్ ఇస్తున్నారు.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన చిన్ననాటి ఫొటోతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. ఇటీవల వరుణ్ తేజ్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి, అలాగే తను నటించబోయే సినిమాలకు సంబంధించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ ఈ చిట్ చాట్‌లో తనదైన తరహాలో సమాధానాలు ఇచ్చారు.

తన తాతా వెంకట్రావుతో కలిసి ఓ విమానంలో వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘మంచి పాత జ్ఞాపకాలు.. మా తాతయ్యతో’ అంటూ ట్వీట్ చేసాడు. తాతయ్య కొణిదెల వెంకట్రావు‌ ఒడిలో చిన్ననాటి వరుణ్ తేజ్ కూర్చుని ఉన్నఅరుదైన ఈ ఫొటో ను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసాడు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి వెంకట్రావు విమాన ప్రయాణంలో ఉండగా వరుణ్ తేజ్‌ను తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్నారు. వరుణ్ తేజ్ ఈ పిక్‌ను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."