హైపర్ ఆది మీద విపరీతమైన కోపంతో నాగబాబు… కారణం అదేనా …!
మెగా ఫ్యామిలీకి వీర విధేయులు చాలామందే ఉన్నారు. అందులో హైపర్ ఆది ఒకడు. కత్తి మహేష్ ఇష్యూలో హైపర్ ఆది రియాక్ట్ అయిన తీరు అందుకు తార్కాణం. ఇక జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ సీటుకి నాగబాబు పోటీచేస్తే, ఆ ఎన్నికల్లో హైపర్ ఆది ప్రచారంలో కూడా జోరుగానే పాల్గొన్నాడు. అయితే జబర్దస్త్ నుంచి నాగబాబు జీ తెలుగులో అదిరింది షో కి వెళ్లగా, హైపర్ ఆది మాత్రం తెలివిగా జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. అయితే తన వెంట హైపర్ ఆది రావడం ఖాయమని జీ తెలుగు వారికి నాగబాబు అప్పటికే చెప్పేశాడు.
అయితే హైపర్ ఆది మాత్రం ఎమ్మెల్యే రోజా జోక్యంతో జబర్దస్త్ లోనే ఉండిపోవడంతో హైపర్ ఆది నిర్ణయం కరెక్టే అని తేలింది. నిజానికి అంతకుముందు జబర్దస్త్ ఎలా ఉండేదో నాగబాబు వెళ్లిపోయినా కూడా రోజా ఒంటి చేత్తోనే జబర్దస్త్ కి మంచి టీఆర్పీలు సాధిస్తోంది. ఇదేసమయంలో అదిరింది షో మాత్రం పెద్ద గా అదరగొట్టేయడం లేదు. దీంతో నాగబాబు ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడని గాసిప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హైపర్ ఆదిపై నాగబాబు కోపంగా ఉన్నాడట.
ఎందుకంటే మెగా ఫ్యామిలీ వైపు ఉంటూనే, చివరకు ఇలా హ్యాండ్ ఇస్తాడని నాగబాబు భావించలేదు. అందుకేనేమో మొన్న యూట్యూబ్ లో నాగబాబు పెట్టిన లైవ్ లో కేవలం మాస్ అవినాష్, గెటప్ శ్రీనులతోనే మాట్లాడేసి, హైపర్ ఆదిని అవాయిడ్ చేశాడు. అసలే జీ తెలుగుకు వచ్చి చమ్మక్ చంద్ర బాగా దెబ్బతిన్నాడు. జబర్దస్త్‌లోనే ఉండి ఉంటే తన రేంజ్ వేరు. అయితే హైపర్ ఆది తన కెరీర్ దృష్ట్యా ఎమెల్యే రోజా మాటను విని మంచి నిర్ణయం తీసుకున్నాడని అతడి ఫాన్స్ సంతోష పడ్డారు. కానీ నాగబాబు ఎందుకో హైపర్ ఆదిపై కోపంగానే ఉన్నాడని అంటున్నారు.