Movies

మాస్ కా దాస్ స్మాల్ స్క్రీన్స్ ను “హిట్” చేసేది అప్పుడే.?

ఇప్పుడున్న యువ హీరోల్లో యూత్ లో అతి అతి తక్కువ సినిమాలతో మంచి క్రేజ్ ను ఏర్పచుకున్న హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకరు. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంతరించుకున్నాడు. అలాగే తాను టేకప్ చేస్తున్న సినిమాల ద్వారా ఆడియెన్స్ కు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అలా లేటెస్ట్ గా చేసిన చిత్రమే “హిట్”.

మాంచి క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నాచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రం పేరుకు తగ్గట్టుగానే థియేటర్స్ లో “హిట్” అయ్యింది, అలాగే లేటెస్ట్ గా కూడా రికార్డు స్థాయి వ్యూవర్ షిప్స్ తో అమెజాన్ ప్రైమ్ లో కూడా “హిట్” అయ్యింది.

అయితే ఇప్పుడు విశ్వక్ బుల్లితెరను హిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు ఈ చిత్రాన్ని ఈ మే 1 శుక్రవారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం తప్పకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా మంచి రేటింగ్ రాబట్టే అవకాశం ఉంది.