పాపం… పూరి జగన్నాథ్ ఆ హీరోయిన్ ని బాగా మిస్ అవుతున్నాడట…

తెలుగులో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అప్పట్లో దర్శకత్వం వహించిన “బద్రి” అనే చిత్రం విడుదలయింది.ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అంతేకాక ఈ చిత్రంతో నూతన దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి పూరి జగన్నాథ్ వచ్చి రావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో తరువాత వెనుతిరిగి చూసుకునే అవసరం రాలేదు.

అయితే విభిన్న కథనాలు ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేయడంలో పూరి జగన్నాథ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.అందువల్లే పూరి జగన్నాథ్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అంతేగాక ఆయన సినిమాలను మరియు మేనరిజాన్ని ఇష్టపడే వాళ్ళు కోకొల్లలు.

తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించాడు పూరి జగన్నాథ్.ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ఇలా దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న టువంటి అందరి హీరోలకు హిట్ ఇచ్చి కవర్ చేశాడు పూరి జగన్నాథ్.

తాజాగా పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమై 20 సంవత్సరాలు కావస్తోండడంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇందులో తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ పూరి జగన్నాథ్ కి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా “శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఈ విజయానికి అర్హులని, లవ్ యు సార్” అంటూ ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ కి పూరి జగన్నాథ్ స్పందిస్తూ నిధి లవ్ యు నేను నిన్ను మిస్ అవుతున్నాను తొందర్లోనే మళ్ళీ కలుద్దాం అంటూ రిప్లై చేశాడు.