Movies

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా ?

టాలీవుడ్ లో ధ్రువతారగా దూసుకొచ్చి కేరీర్ సడన్ డౌన్ అయిపోయి, ఆత్మహత్య చేసుకున్న ఉదయ కిరణ్ మరణించి ఆరేళ్ళ అయినా కూడా ఇప్పటి కీ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. తెలుగు ఇండస్ట్రీపై వేసిన ముద్ర తో ఇతన్ని మరిచిపోవడం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీకి రావడం,హిట్స్ కొట్టడం,డౌన్ అవ్వడం, లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అన్నీ చిత్రంగానే జరిగిపోయాయి. మధ్యలో కొన్నేళ్ల పాటు ధృవ తారగా వెలిగిపోయాడు. అనుకోని కారణాలు.. కొన్ని ఊహించిన కుదుపులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని ఇన్నేళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మస్కట్‌లో ఉంటున్న అతడి అక్క శ్రీదేవి సంచలన వ్యాఖ్యలతో ఉదయ్ మరణం వెనక మిస్టరీ ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.

కుటుంబ కలహాలతోనే ఉదయ్ చచ్చిపోయాడనే అర్థం వచ్చేలా ఉదయ్ అక్క శ్రీదేవి మాట్లాడింది. తన తమ్ముడు కోటీశ్వరుడు అని.. వాడికి డబ్బుల్లేక చచ్చిపోవాల్సిన ఖర్మ పట్టలేదని చెప్పింది. భార్య విషితపైనే తమకు అనుమానాలున్నాయని సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ భార్య విషిత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.బంగారం, డబ్బులతో పాటు ఉదయ్ పేరు మీదున్న స్థిరాస్తులు కూడా భార్య విషిత తీసుకుందని.. కనీసం మాట్లాడటానికి కూడా ఇప్పుడు అవకాశమివ్వడం లేదని శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.

అసలు ఉదయ్ చచ్చిపోయిన తర్వాత ఆమె కనిపించడం లేదు. మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటోంది. ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం కూడా అస్సలు ఉదయ్ కుటుంబంతో కలవలేదు. ఒక్కసారి ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి.. 11 రోజులు పూర్తైపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్న దాఖలాలు లేవని ఉదయ్ అక్క చెప్పింది.అయితే విషిత ఇప్పుడు బయటికి రాకపోతే ఉదయ్ కిరణ్ అక్క చెప్పిందే నిజమవుతుందని అందరూ భావిస్తున్నారు. అప్పుడు నిజంగానే భార్య విషిత కారణంగానే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడేమో అనే వార్తలు కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నమ్మే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ఆరోపణలను విషిత లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె బయటికి వచ్చి స్పందించడం కూడా అనవసరం అని ఫీల్ అవుతున్నట్లు సన్నిహితుల టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."