Movies

ముందు “గ్యాంగ్ లీడర్” తర్వాతే అంటున్న “వెంకీ” మామ.!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఒక “బి ది రియల్ మ్యాన్” అనే ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సెన్సషనల్ డైరెక్టర్ శ్రీకారం చుట్టిన ఈ ట్రెండ్ ఇప్పుడు వేగంగా ఊపందుకుంది. గత కొన్ని రోజుల కితమే స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ లో భాగంగా తారక్ కు ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసి అలనాటి టాప్ హీరోలు అందరికీ ఛాలెంజ్ విసిరాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి బాలయ్య, వెంకటేష్ నాగార్జునలకు ఈ ఛాలెంజ్ ను తారక్ ఇవ్వగా..

మెగాస్టార్ మొదట స్పందించి ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా అని తనదైన శైలిలో చెప్పారు. ఇప్పుడు అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకీ మామ కూడా తారక్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా అని తాను కూడా తన మార్క్ జిఫ్ ఫైల్ క్లిప్ తో ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చారు. కానీ తన వీడియో రావాలి అంటే మొదటగా తమ అందరి గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారి వీడియో కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపారు. మరి మెగాస్టార్ ఎప్పుడు వీడియో పెడతారో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."