Movies

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరో కొత్త సినిమా.!

ఈటీవీ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన యాంకర్స్ లో స్మాల్ స్క్రీన్ బ్యూటీ అనసూయ కూడా ఒకరు. తనదైన హావభావాలతో మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్న రంగమ్మ అత్త ఒక్క బుల్లితెర మీదనే కాకుండా వెండి తెర మీద కూడా ఆకట్టుకుంది. అలా తాను మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.

అనసూయ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ అవసరాల మరియు వెన్నెల కిషోర్ తదితరులు కలయికలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన చిత్రం “కథనం”. థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “స్టార్ మా” ఛానెల్ వారు టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ ఏప్రిల్ 25 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ లాక్ డౌన్ లో స్టార్ మా కూడా తమ వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."