మొన్న “సంక్రాంతి” ఇప్పుడు “శివరామరాజు”.!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీస్ అంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. అందుకు ఇప్పుడు వారికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ తెర మాత్రమే. దీనితో చాలా కాలం తర్వాత మళ్ళీ బుల్లితెర కళకళలాడుతుంది.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పాత సినిమాలు ముఖ్యంగా ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ సినిమాలు అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ లను సంపాదిస్తున్నాయి. అలా ఇటీవలే జెమినీ ఛానెల్లో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతి” సినిమాను టెలికాస్ట్ చెయ్యగా దానికి 6.45 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

2004లో విడుదలైన ఈ చిత్రం ఇంత టీఆర్పీ రాబట్టగా 2002 లో మరో ఫ్యామిలీ హీరో జగపతిబాబు హీరోగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ ఓ కీలక పాత్రలో వి సముద్ర దర్శకత్వంలో తమిళ్ “సముదిరం” అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం “శివరామరాజు”.ఈ సినిమాను గత వారం జెమినీ ఛానెల్లో ఉదయపు స్లాట్ లో టెలికాస్ట్ చెయ్యగా 5.12 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ లాక్ డౌన్ సమయంలో పాత సినిమాలు మంచి టీఆర్పీ లను రాబడుతున్నాయి.