Movies

మా కాపురంలో నిప్పులు పోయద్దు.. చిరంజీవికి పీవీపీ విన్నపం..!

మెగస్టార్ చిరంజీవి #BeTheRealMan ఛాలెంజ్‌లో భాగంగా జూనియర్ ఎన్‌టీఆర్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాడు. స్వయంగా చిరంజీవి ఇంటిని తూడ్చి, వంట చేశాడు. అంతేకాదు వేడి వేడిగా అట్లు వేసి తన తల్లికి రుచి చూపించాడు. ఇలా చేసి ఈ ఛాలెంజ్ చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజినీ కాంత్‌లను నామినేట్ చేశాడు.

అయితే చిరంజీవి చేసిన ఈ టాస్క్‌పై స్పందించిన వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ మాదిరి నలభీమ పాకము వండుతుంటే మా ఆవిడ మెగాస్టారే చేయగా లేనిది మీకేమిటి అని అంటున్నారు. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు అంటూ జోక్‌గా కామెంట్స్ చేశారు.