Movies

ఎఫ్3లో సర్‌ప్రైజ్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించడంతో వారిద్దరు తమదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను అదరగొట్టారు.కాగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సెస్ అయ్యింది.

ముఖ్యంగా వెంకీ కామెడీ టైమింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.అటు ఈ సినిమా ఇచ్చిన భారీ సక్సెస్‌తో ఈ సినిమాకు ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని గతంలోనే అనౌన్స్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.కాగా ఇప్పుడు ఈ సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే స్క్రిప్టు పనులు కూడా పూర్తి చేస్తున్న అనిల్ రావిపూడి, లాక్‌డౌన్ తరువాత ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.

కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కేమియో ఉంటుందని తెలుస్తోంది.ఆ స్టార్ హీరో ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే మహేష్‌కు సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్‌బస్టర్ అందించడంతో ఆయనే ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తాడని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది.మరి ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో వచ్చే ఆ హీరో ఎవరో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."