Movies

“కార్తీక దీపం” క్రేజ్ తగ్గిపోయిందా?

ప్రస్తుతం మన తెలుగులో ఉన్న ఛానెల్స్ లో ఆల్ టైం హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ను సంపాదించే ఏకైక సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి. ఈ సీరియల్ టీఆర్పీ రికార్డులు ఎలా ఉండేవి అంటే మన దక్షిణాదిలోనే కాకుండా మొత్తం మన దేశంలోనే ఏ భాషలోని ధారావాహికకు రానంత రేటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ క్రేజ్ తగ్గిపోయింది అని చెప్పాలి.

లాక్ డౌన్ ఉన్నప్పటికి ప్రతీ వారం సీరియల్ యావరేజ్ గా మన తెలుగులో టాప్ 2 స్థానంలో అత్యధిక వ్యూవర్ షిప్స్ తో నిలిచే ఈ సీరియల్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్ ప్లేస్ లో ఈటీవీ న్యూస్ అత్యధికంగా 8 లక్షలకు పైగా ఇంప్రెషన్స్ తో అనగా తర్వాత రెండు స్థానాలలోనూ జెమినీ టీవీ లోని మహర్షి మరియు విజిల్ సినిమాలు నిలిచాయి. అలాగే మళ్ళీ టాప్ 5 స్థానంలో ఈటీవీ జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఎపిసోడ్ నిలిచింది. దీనితో కార్తీక దీపం క్రేజ్ కాస్త తగ్గిందని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."