Movies

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి పెళ్లి, ఎప్పుడు ఎవరితో తెలుసా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌, సుధీర్‌లు ప్రేమలో ఉన్నారు.పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.కాని అసలు విషయం ఏంటీ అంటే వారు ఎంత చేసినా ఏం చేసినా కూడా అది కెమెరా ముందు వరకే.కెమెరా ఆఫ్‌ అయితే ఇద్దరు కేవలం స్నేహితులు మాత్రమే.మంచి స్నేహితులం మాత్రమే అంటూ గతంలో పలు సార్లు సుధీర్‌ మరియు రష్మిలు చెప్పారు.వీరిద్దరి మద్య ఏం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటూ ఉంటారు.

సుధీర్‌తో ప్రేమ లేదు కాని ఒక వ్యాపారవేత్తతో రష్మి గౌతమ్‌ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైజాగ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుతో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా బుల్లి తెరకు చెందిన ఒక నటుడు అనధికారికంగా చెప్పాడు.అతడు ఒక ఇంటర్వ్యూలో తనకు ఇండస్ట్రీలో రష్మి మంచి స్నేహితురాలని, ఆమెకు సుధీర్‌కు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని కాకుంటే ఆమె ఒక మంచి జీవితంను పొందబోతుంది. ఆమె ఇప్పటికే ప్రేమలో ఉందని అన్నాడు.

రష్మి కుటుంబ సభ్యులు కూడా అతడితో పెళ్లికి ఇష్టంగానే ఉన్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాదికి వీరి పెళ్లి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.రష్మి గౌతమ్‌ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకు పోతుంది. అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లికి సిద్దం అవ్వాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే రష్మి ప్రేమ విషయాన్ని మాత్రం కొందరు కొట్టి పారేస్తున్నారు. అసలు ఆమె ఎవరితోనూ ప్రేమలో లేదని అంటున్నారు.అసలు విషయం ఏంటీ అనేది ఆమె చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."