Movies

చిరంజీవి సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

స్టార్ట్ చేసిన సినిమాలన్నీ పూర్తికావు .. కొన్ని స్టార్ట్ అయ్యాక కూడా ఆగిపోతాయి… మరికొన్ని మధ్యలో ఆగిపోతాయి .. కొన్ని చివరకొచ్చాక ఆగిపోతాయి .. ఇంకొన్ని సినిమాలు పూర్తయినా సరే విడుదలకు నోచుకోవు.. అయితే చిన్న హీరోల విషయంలోనే కాదు అగ్ర హీరోల విషయంలో కూడా ఇలాంటి ఘటనలు ఉంటాయి. ఇక 1997లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ సంఘటన పరిశీలిస్తే,.. అశ్వినీదత్ నిర్మాణంలో చిరంజీవి ,టబు హీరో హీరోయిన్స్ గా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో భూలోక వీరుడు అనే సోషల్ ఫాంటసీ సినిమా స్టార్ట్ చేసారు.

ఒక యాక్షన్ సీన్,ఓ పాట షూట్ చేసారు. కానీ బడ్జెట్ ఒకటి అయితే ఖర్చు మరోలా కనిపించింది. ఒక పాటకి ,సీన్ కి చాలా ఖర్చయిపోయిందట. ఇలా ఐతే మూడు రెట్ల బడ్జెట్ కూడా చాలదన్న వాదన సింగీతం,అశ్వినీదత్ ల మధ్య జరిగి, ఇద్దరి మధ్యా ఇగోలు పెరిగిపోవడంతో చివరకు సినిమా ఆగిపోయింది. సరే, దత్ గారు రామ్ గోపాల్ వర్మతో ఓ మూవీ ఉంది అది చేద్దాం అని చిరంజీవి అనడంతో వర్మ డైరెక్షన్ లో ఊర్మిళ హీరోయిన్ గా చిరు హీరోగా సినిమా స్టార్ట్ చేసారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. ఓ సాంగ్ కూడా షూట్ చేసారు.

అయితే చిరు,వర్మల మధ్య క్రియేటివిటీ విషయంలో విబేధాలు రావడంతో అదీ ఆగిపోయింది. వర్మ ఎక్కడా రాజీపడ్డని అందుకే మూవీ ఆగిపోయిందని అశ్వినీదత్ స్వయంగా చెప్పాడు. అయితే దత్తు గారికి ఇచ్చిన మాట ప్రకారం మూడో సినిమాగా చూడాలని ఉంది తీశారు. ఆగిపోయిన రెండు సినిమాల్లో చిత్రీకరించిన రెండు సాంగ్స్ ని ఇందులో యాడ్ చేసారు. ఇది బ్లాక్ బస్టర్ అయింది. ఆగిపోయిన రెండు సినిమాల నష్టం భర్తీ కూడా అయింది. అంతేకాదు ఆగిన రెండు సినిమాల్లోని పాటలను వినాలని వుంది పేరిట ఓ ఆడియో కేసెట్ కూడా అప్పట్లో రిలీజ్ చేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."