Movies

తన అర్థిక పరిస్థితిపై షాకింగ్ కామెంట్స్ చేసిన గెటప్ శ్రీను

తన నటనతో, వివిధ రకాల గెటప్‌లతో కామెడీలో నవరసాలను పండించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జబర్దస్త్ కమెడీయన్ గెటప్ శ్రీను తాజాగా లాక్‌డౌన్ సమయంలో ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే తాను ఏ విధంగా లాక్‌డౌన్ రోజులను గడుపుతున్నాడు, ఏ విధంగా ఈ సమయ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడన్న వాటి గురుంచి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అయితే లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉండడంపై మీ అభిప్రాయం ఏమిటని అడగగా నిత్యం తాను కొత్త కొత్త స్క‌ిట్లు రాసుకుంటున్నానని, సాదార‌ణ రోజుల కంటే ఇప్పుడేకాస్త ఎక్కువ స‌మ‌యం కొత్త విషయాల నేర్చుకునేందుకు కేటాయిస్తున్నానని తెలిపాడు. అయినా ప్ర‌పంచానికి లాక్ డౌన్ కానీ నా బ్రెయిన్‌కి మాత్రం కాదు అంటూ సమాధానమిస్తున్నాడు. ఇకపోతే కరోనా మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అని అడగగా అర‌గంట‌కోసారి చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం, ఇంట్లోనే ఉండడం, ఇప్పుడు పోన్‌తో పాటు డైలీ జీవితంలో శానిటైజర్ కూడా జేబులో పెట్టుకుని ఉండడం అంటూ బదులిచ్చాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్ హీరోలే డబ్బులు లేవని అంటున్నాడని మరి మీ అర్థిక పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ప్రస్తుతానికి మాకు మల్లెమాల వారు పేమెంట్స్ ఇస్తున్నారని, మ‌ల్లెమాల ఉన్నంత వ‌ర‌కు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతూ, లాక్‌డౌన్ వలన సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ఇబ్బందులు ఎదురుకుంటున్నారని చాలా మంది ఇప్పటికే ముందుకు వ‌చ్చి సాయం చేస్తున్నారని అన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."