“పుష్ప” స్టోరీ లీక్… షాక్ లో అల్లు అర్జున్
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే ఒక పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ ప్లాన్ ప్రకారం ఇప్పటికే ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా తీర్చిదిద్ధేందుకు సుక్కు పక్కా ప్లానింగ్ తో ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక ఊహించని వార్త వినిపిస్తుంది. వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా స్టోరీ కు సంబంధించి ఈ సినిమాలో బన్నీ ఒక ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే రోల్ లో మాత్రమే కనిపిస్తాడని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి అసలు స్టోరీ లైన్ ఏమిటి అన్నది బయటకు వచ్చింది.
ఈ సినిమాలో హీరో పాత్ర రాయలసీమలో తన యుక్త వయసులోనే తన కుటుంబం నుంచి వేరయ్యిపోయి ఎర్ర చందనం స్మగ్లర్ గా మారుతాడు. అలా మారి లెక్కలేనంత డబ్బు సంపాదిస్తాడు ఆ తర్వాత తన కుటుంబాన్ని మళ్ళీ కలిశాడా లేదా? కలిస్తే ఎలా కలిసాడు? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ప్లాట్ లైన్ అన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ స్టోరీని ఊహించని సస్పెన్సులు మలుపులు మరీ ముఖ్యంగా బలమైన ఎమోషన్స్ తో సుక్కు ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇవన్నీ వర్కౌట్ అయితే బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడడం ఖాయం అని చెప్పాలి. మరి ఇదే స్టోరీయా కాదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
