Movies

డైరెక్ట్ ఓటిటి లోకి రాబోతున్న మరో సినిమా.!

ఇప్పుడు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల రీత్యా చేసేది ఏమీ లేక తమ సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి దింపేస్తున్నారు. పెద్ద సినిమాలు కాదు కానీ చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే వాయిదా పడుతూ వస్తున్న సినిమాలను డిజిటల్ యాప్ సంస్థలు కొనేసుకొని విడుదల చేస్తున్నారు.

ఈ సాంప్రదాయం టాలీవుడ్ లో ఇంకా ఊపందుకోలేదు కానీ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలు మాత్రం చాలానే రెడీగా ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ లో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొన్ మగళ్ మందాల్ మొదట వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మరో సినిమా నెట్ ఫ్లిక్స్ లో రానున్నట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్లతో మోత మోగించిన దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ హీరోగా సనా, అంజనా కీర్తి హీరోయిన్లుగా శరవన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆర్ కె నగర్”. 2017 లోనే పట్టాలెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఎప్పటికప్పుడు కొత్త చిక్కులు పడుతుండడంతో ఇక ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."