హీరోయిన్ సిమ్రాన్ గుర్తు ఉందా…ఇప్పుడు చేస్తుందో తెలుసా?
పొడుగు కాళ్ళ సుందరి సిమ్రాన్ అప్పట్లో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అందం అభినయంతో పాటు, మెస్మరైజ్ చేసే డాన్సులు సిమ్రాన్ సొంతం. మన సీనియర్ స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. హీరోయిన్ గా రిటైర్ అయిన సిమ్రాన్ కొంత కాలంగా వయసుకు దగ్గ పాత్రలు చేస్తుంది. తమిళంలో ఆమె వరుసగా చిత్రాలు చేస్తుంది.
ఇస్త్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న రాకెటరీ మూవీలో హీరో మాధవన్ కి జంటగా సిమ్రాన్ నటిస్తున్నారు. కాగా ఈ అమ్మడు అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా అప్లికేషన్ టిక్ టాక్ లోకి ప్రవేశించింది. అంతే కాకుండా వరుస వీడియోలు చేస్తూ ఆమె ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయితో కలిసి ఆమె చేస్తున్న వీడియోస్ కి భారీగా వ్యూస్ మరియు లైక్స్ దక్కుతున్నాయి. ఆ వీడియోలకి వస్తున్న రెస్పాన్స్ రీత్యా ఆమె మరిన్ని వీడియోలు చేస్తున్నారు.