ఎన్టీఆర్, విజయశాంతి కల్సి నటించారా….ఏ సినిమాలో…?
కొంతమంది యాక్టర్లు,హీరోయిన్స్ అయితే ఫలానా వాళ్ళతో నటించే ఛాన్స్ రాలేదని తెగ బాధ పడిపోతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్లతో నటించాలంటే వాళ్ళు లేరు కనుక. గతంలో నందమూరి తారక రామరావు తో నటించడం అంటే గొప్పగా ఫీలయ్యేవారు. ఆయన సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా చాలని సంబరపడేవారు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్ గురించి సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. ఆయన సినీ జీవితంలో దాదాపు 300 పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ఈసినిమాల్లో ఎంతో మంది కథానాయికలతో ఆడిపాడారు.
అందులో ఎంతో మంది ఎన్టీఆర్ తో జోడీ కట్టి సూపర్ హిట్ జోడి గా నిలిచారు. అయితే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి మాములు కథానాయికగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి లేడీ సూపర్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు లేడీ అమితాబ్‌గా మాస్‌లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. తెలుగులో కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జోడిగా నటించింది. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో మాత్రం జోడిగా విజయశాంతి మాత్రం నటించలేదు.
అయితే ఓ విచిత్రం జరిగింది. అదేమంటే,ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు హీరోలుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యం శివం’ సినిమాలో విజయశాంతి నటించింది. కానీ అది కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు చెల్లెలి పాత్రలో నటించింది. ఈ రకంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా చేయాలనుకున్నప్పటికీ చెల్లెలి పాత్రతోనే సరిపెట్టుకుంది. ఏదైతేనేం ఎన్టీఆర్ సరసన హీరోయిన్ నటించాలనుకున్న విజయశాంతి కోరిక మాత్రం తీరలేదు. కానీ ఎన్టీఆర్ బాటలోనే విజయశాంతి రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ఓ శైలి ఏర్పరచుకుంది. ఇక ఏఎన్నార్‌కు చెల్లెలు పాత్రతో పాటు మెకానిక్ అల్లుడు సినిమాలో కూతురుగా నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో తప్పించి మిగతా అగ్ర హీరోలందరితో విజయశాంతి జోడి కట్టేసింది.