తెలంగాణ లో లాక్ డౌన్ అమలు పై కేసీఆర్ కీలక నిర్ణయం..!

kcr took another key decision on lockdown extension

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలలో జూన్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

అలానే జూన్ 7 వరకు లాక్ డౌన్ అమలు లో రాష్ట్రంలో యధావిది గా కొనసాగుతుంది అని తెలిపింది.

ఇక కర్ఫ్యూ టైమ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సదలిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక పై తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఈ కర్ఫ్యూ ఉంటుంది.

ఇప్పటివరకు ఈ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఉంది.

జూన్ 1 వ తేదీ నుండి ఈ కర్ఫ్యూ సడలింపు అమలు కానుంది.అయితే కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జూన్ నెలాఖరు వరకు ఈ లాక్ డౌన్ ఉండనుంది.

అంతేకాక ప్రైమరీ కాంటాక్ట్ ల పై కూడా నిఘా ఉంచనుండి. అత్యవసరాల కి మాత్రం అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అయితే వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులో లేని ప్రాంతాలలో షరతులు విధించడం పట్ల అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అయితే అంతరాష్ట్ర రవాణా వ్యవస్థ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక పై ఒక రాష్ట్రం నుండి తెలంగాణ కి వచ్చేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన తేదీ నీ మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం సైతం జూన్ 8 నుండి దశల వారీగా సడలింపు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణ కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

kcr took another key decision on lockdown extension