Devotional

జూన్ 8 నుండి తిరుమల శ్రీవారి దర్శనం…కండిషన్స్ అప్లై!

TTD will be open from june

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణం గా భారత్ లో ఇప్పటివరకు 5 వేలకు పైగా మరణించారు.

ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉన్న దేశాలలో భారత్ 7 వ స్థానం లో ఉంది.అయితే ఈ నేపధ్యంలో దేశాల వారిగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి.

జూన్ 8 వ తేదీ నుండి తిరువల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే రోజుకి ఏడు వేల మందికి మాత్రమే ఈ దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

గంటకి 500 మందికి చొప్పున మొత్తం 14 గంటలు 7000 మందికి దర్శనం ఉండనుంది.

అయితే దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి.అంతేకాక ఆలయం లో భౌతిక దూరం తప్పక పాటించాలి.

చేతులకు గ్లోజ్ లను కూడా తప్పనిసరిగా ధరించాలి. అయితే మొదటి మూడు రోజులు టీటీడీ ఉద్యోగులకు, సిబ్బందికి మాత్రమే దర్శనం ఉండనుంది.

ఆ తర్వాత తిరుపతి, తిరుమల లో ఉండేవారికి పక్షం రోజులు దర్శన , వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంది.దర్శనానికి సంబంధించిన టికెట్ లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి.

అలానే వసతి గృహాలను సైతం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి.

ముందుగానే అన్ని చర్యలు తీసుకున్న జూన్ 8 నుండి తిరుమల శ్రీవారి దర్శనం అయ్యేందుకకు టీటీడీ చర్యలు తీసుకుంది.