Movies

వాళ్లనే కాదు డైరెక్టర్స్ ని ఈ భయం కుదిపేస్తోందట…ఇంకా ఎంత కాలమో…?

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. అగ్ర రాజ్యాలు సైతం వణికిపోతోన్నాయి. ఇక మన దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మూతపడిపోయింది. దీంతో సినిమా షూటింగులు నిల్చిపోగా, థియేటర్స్ కూడా మూతపడిపోవడంతో బొమ్మ పడి చాన్నాళ్లయింది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని షరతులతో షూటింగులకు ప్రభుత్వాలు అనుమతిస్తున్న ప్పటికీ… థియేటర్స్ రీ ఓపెనింగ్ పై మాత్రం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. షూటింగులకు అనుమతులు రావడంతో ప్రొడ్యూసర్స్ తమ సినిమాల చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యాక్టర్లకి టెక్నీషియన్లకి డైరెక్టర్లకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుందట.

ఈ భయం వలన చాలా మంది స్టార్ హీరోలు షూటింగ్స్ కి రావడానికి ఇష్టపడటం లేదట. వివరాల్లోకి వెళ్తే, … ఓటీటీల ప్రభావం థియేటర్లు డిస్ట్రీబ్యూటర్ల మీదే కాకుండా తమ మీద కూడా పడబోతోందని ఆలోచిస్తున్నారట ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకి ఫైనాన్స్ దొరకడం కష్టం అని చెప్పక తప్పదు. అయితే ఈ పరిస్థితిని అనువుగా తీసుకొని కొన్ని ఓటీటీలు డైరెక్ట్ రిలీజ్ స్లాట్ అంటూ నిర్మాతలకి గాలం వేసి ఉంచుతున్నాయి. ఎందుకంటే బడా నిర్మాతలు సైతం ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ ఓపెన్ చేసి ఉంచారు. అందుకే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అవుతాయో లేదో అని భయపడుతున్న ప్రొడ్యూసర్స్ మాత్రం ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట.

దీంతో ఇప్పటిదాకా ఈ ఓటీటీల ప్రభావం థియేటర్లు డిస్ట్రీబ్యూటర్ల మీదే కాకుండా ఇకపై యావరేజ్ బిలో యావరేజ్ రేంజ్ ఉన్న యాక్టర్లు టెక్నీషియన్ల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలతో పాటు, సైన్ చేసే సినిమాలు షూట్ కి వెళ్లే లోపే ఓటీటీ రిలీజ్ చేసేలా కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఒప్పందాలు కుదిరాయట. సహజంగా ఒక సినిమా కాకపోయినా ఆ తరువాత సినిమా నుంచైనా వీరి మార్కెట్, పైగా రెమ్యూనరేషన్ తగ్గిపోవడం ఖాయం. పారితోషకాలు ఒకే రేంజ్ లో అంటే ‘ఫిక్సడ్ సాలరీ వితౌట్ హైక్స్’ అనే స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే, క్రేజ్ ఉన్న వాళ్లతో పాటు మార్కెట్ ఉన్న వాళ్ళల్లో రెమ్యునరేషన్ భయం పట్టుకుందట. మొత్తానికి ఓటిటి ప్రభావం స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్ లను కంగారు పెట్టిస్తోందని టాక్.