Movies

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించిందో ?

చైల్డ్ ఆర్టిస్టుగా చేసి,ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసిన చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక హీరోగానే,హీరోయిన్ గానో వస్తే గుర్తుపట్టడం చాలా కష్టంగానే ఉంటుందని చెప్పాలి. ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య ఇప్పటికి అందరి మదిలో మెదులూతూనే ఉంటుంది. అయితే అంతకు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ హీరో జగపతిబాబు హీరోగా నటించిన సందడే సందడి చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత రాలేదు.

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన కొంతకాలానికి టాలీవుడ్ దర్శకుడు గోవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన లవ్ యూ బంగారం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైంది.ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించాడు ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. శ్రావ్య తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.అయితే హైదరాబాదులో పుట్టి పెరిగిన శ్రావ్య నగరంలో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది.

ఆ తర్వాత నటన మీద ఆసక్తి కనబరచడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించి సినీపరిశ్రమకు పంపించినట్లు గతంలో శ్రావ్య ఇంటర్వ్యూలో తెలిపింది.అయితే 2017వ సంవత్సరంలో విలయత్తు ఆరంభం అనే తమిళ చిత్రంలో అనే చిత్రంలో శ్రావ్య చివరగా కనిపించింది. కాగా ఇప్పటివరకు శ్రావ్య తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపు ఏడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకి సంబంధించి సినిమా గురించి తాజాగా ఎలాంటి కబురు అయితే మాత్రం రాలేదు.