Movies

బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ భార్య…బిజినెస్ ఏమిటో…?

టాలీవుడ్‌లో కొందరు హీరోల భార్యలు ఇప్పటికే పలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ తమ సత్తా చాటుతుండగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య కూడా వ్యాపారంవైపు అడుగులు వేస్తున్నారట. ఈవిషయం వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా పలు యాడ్ కంపెనీలకు అంబాసిడర్‌గా చేస్తూ, తారక్ రెండుచేతులా సంపాదిస్తున్నాడు. అయితే సినిమా రంగంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు సైతం ఏదో ఓ బిజినెస్ చేస్తూ సంపాదించడం ఈమధ్య బాగా కనిపిస్తోంది.

ఇప్పుడు ఇదే కోవలోకి తారక్ భార్య లక్ష్మీ ప్రణీత కూడా రానున్నట్లు తెలుస్తోంది.ఈ అంశానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తారక్ భార్య లక్ష్మీ ప్రణీత న్యూస్ మీడియా రంగానికి చెందిన బిజినెస్‌లో అడుగుపెట్టాలని చూస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ మేరకు తన మామగారి సాయంతో ఓ టీవీ ఛానల్‌ను ప్రారంభించేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు, ఈ వ్యాపారం ఆయన భార్య చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ టీవీ ఛానల్‌కు యువ అనే పేరును పెట్టబోతున్నట్లు చిత్రపురిలో వార్తలు వస్తున్నాయి.భార్య చేయబోయే బిజినెస్ లో తారక్ ఏ విధంగా సాయం చేస్తాడు, ఆయన ఈ టీవీ ఛానల్ కోసం ఏదైనా ప్రత్యేక షోలు చేస్తాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."