Movies

లూసిఫెర్ సినిమాలో చిరు సోదరిగా స్టార్ హీరోయిన్ ఎవరో చూడండి

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటిస్తుందని పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కీలకమైన మార్పులు చేయించారట చిరంజీవి.

ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇస్తుందట ఈ సినిమా . ఇక గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమాకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయినా సరే చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకంతో అతనికే ఈ సినిమా రీమేక్ బాధ్యతలు అప్పగించారు. సుజిత్ చిరు నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."