Movies

సుశాంత్ నెలకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవాడో తెలుసా ?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అతను ఆర్ధిక సమస్యల కారణముగా సూసైడ్ చేసుకున్నారని కథనాలు వచ్చాయి. దాంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా సుశాంత్ నెలకు ఎంత ఖర్చు పెడతాడో అని అరా తీయగా దాదాపుగా 10 లక్షల వరకు ఖర్చు పెడతాడని తెలిసింది.

సుశాంత్ ఉండే బాంద్రా అపార్ట్‌మెంట్‌కు నెలకు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించేవారని, లొనావాల సమీపంలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌కు లక్షల రూపాయల్లో అద్దె చెల్లించేవాడు. కార్లు, బైక్‌లను అమితంగా ఇష్టపడే సుశాంత్‌ వద్ద రేంజ్‌ రోవర్‌, మాసరెటి వంటి లగ్జరీకార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌ ఉండేదని చెప్పారు.